
విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని 6 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఇందులో ప్రైవేటు రంగం నుంచి రూ.5.3 లక్షల కోట్లు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం రూ.3.50-4 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా.
ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి 4 ఎయిర్‌పోర్టులు, 3 పోర్టులను అనుసంధానిస్తూ, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం నిర్దేశించారు.