
బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు పట్టణాభివృద్ధి శాఖ 'గ్రేటర్ బెంగళూరు అథారిటీ (పార్కింగ్) నిబంధనలు-2026' ముసాయిదాను విడుదల చేసింది.
నివాస ప్రాంతాల్లో రోడ్లపై పార్కింగ్ చేసే హ్యాచ్‌బ్యాక్ కార్లకు రూ.15,000, సెడాన్లకు రూ.20,000, ఎస్‌యూవీలకు ఏటా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వాణిజ్య రహదారులపై గంటకు కార్లకు రూ.40-80, ద్విచక్ర వాహనాలకు రూ.20-40 వరకు వసూలు చేయనుండగా, అభ్యంతరాల కోసం ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది.