విప్రో సంస్థ 2025 ఫిబ్రవరిలో ఎంపిక చేసిన 200 మందికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఇప్పటివరకు ఆన్‌బోర్డింగ్ చేయలేదని నైట్స్ సంస్థ ఫిర్యాదు చేసింది.
ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు.
ఐటీ రంగంలో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.