తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడతల వారీగా విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ డీఏల అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు ఉన్న 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంపై కేబినెట్ చర్చించగా, కరువుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.