
గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 77 లక్షల వెండి ఆభరణాలు, ఉత్పత్తులకు హాల్‌మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్ (HUID) జారీ చేసినట్లు బీఐఎస్ వెల్లడించింది.
వెండి హాల్‌మార్కింగ్‌లో దక్షిణాది రీజియన్ 62 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తూర్పు రీజియన్ 18 శాతం, సెంట్రల్ రీజియన్ 10 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ప్రభుత్వం 2025 సెప్టెంబరు 1న వెండి ఆభరణాల కోసం హెచ్‌యూఐడీతో కూడిన హాల్‌మార్కింగ్ విధానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టింది.