
40 ఏళ్లు దాటిన వారిలో హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయని, కాబట్టి ఆహారం, జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
డైలీ డైట్లో ఆకుకూరలు, ఉడికించిన గుడ్డు, డార్క్ చాక్లెట్, బెర్రీలు, పెరుగు వంటి ప్రోబయోటిక్ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా పోషకాలు అందుతాయి.
అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల నివారణకు యోగా, వాకింగ్ వంటి శారీరక శ్రమతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.