
జోగులాంబ గద్వాల జిల్లాలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబాన్ని ఎమ్మెల్యే విజయుడు పరామర్శించి, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి రూ. 2 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా ప్రియాంక కుటుంబ సభ్యులతో మాట్లాడి, పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.