
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో హోంమంత్రి మీర్ జియావుల్లా లాంగౌ కాన్వాయ్‌పై సాయుధ దుండగులు దాడి చేశారు.
ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మంత్రి సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు.
గాయపడిన సిబ్బందిని షహీద్ నవాబ్ ఘౌస్ బక్ష్ రైసానీ ఆసుపత్రికి తరలించగా, దాడికి పాల్పడిన వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.