
జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న 'సిగ్మా' చిత్రం నుండి 'ఓలమ్మో వగలాడి' అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం అందించగా, తమన్, యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ ఆలపించారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాతో దర్శకుడిగా జాసన్ సంజయ్ పరిచయం అవుతున్నారు.