
కృత్రిమ మేధ నియంత్రణ, డీప్‌ఫేక్‌ల కట్టడిపై కేంద్రం దృష్టిసారించిందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ అంశాలపై నెల రోజుల్లోగా ఒక సంప్రదింపుల పత్రం తీసుకురానున్నట్లు తెలిపారు.
డీప్‌ఫేక్‌లు సమాజంలో తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేస్తూ పెను సంక్షోభం సృష్టించగలవని ఆయన హెచ్చరించారు.