
సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను జాతికి అంకితం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా కరవు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలను అందించి, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ, కరవు నేలపై కృష్ణమ్మతో కొత్త చరిత్ర మొదలైందని సీఎం పేర్కొన్నారు.