
చైనాకు చెందిన 'డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్' అనే రహస్య డేటాబేస్ ద్వారా భారతీయులతో సహా వందలాది మంది విదేశీయుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తున్నట్లు వెల్లడైంది.
ఈ డేటాబేస్లో పాస్పోర్ట్ వివరాలు, విమాన ప్రయాణాలు, ఆసుపత్రి రికార్డులు, సీసీటీవీ కదలికలు వంటి సున్నితమైన సమాచారం ఉన్నట్లు సైబర్ పరిశోధకుడు మార్క్ హోఫర్ గుర్తించారు.
జాంగ్జియాకౌ నగరానికి సంబంధించి సుమారు 12 వేల రికార్డులు ఉన్న ఈ వ్యవస్థ, విదేశీ జర్నలిస్టులు మరియు విద్యార్థులపై నిఘా ఉంచేందుకు ఉపయోగపడిందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.