
హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
ఈ వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని నూతన వధూవరులు జనని, సూర్యతేజలను ఆశీర్వదించారు.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.