
యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు.
ముంబయిలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో యశ్ మాట్లాడుతూ, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా కియారా అద్వానీ ఎంతో అంకితభావంతో నటించారని కొనియాడారు.