
గత మూడేళ్లలో భారత్‌లో క్రియాశీలక కంపెనీల సంఖ్య 16 లక్షల నుంచి 22 లక్షలకు చేరిందని నిపుణులు తెలిపారు.
నిబంధనల సరళీకరణ, చవకగా లభిస్తున్న పెట్టుబడి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని పేర్కొన్నారు.
గ్లోబల్ ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరించి వడ్డీ రేట్లను పెంచడం దేశీయ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.