
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఏడు జిల్లాల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వైసీపీ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన ఎస్ఈసీ, సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
అక్టోబర్ 25వ తేదీన 19 పురపాలక సంఘాలు, నగర పంచాయితీల నుంచి బరిలో దిగిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.