
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరియు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించేందుకు మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో అధిష్టానం పిలుపుపై ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌ను కలవనుండగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మల్లికార్జున ఖర్గేను కలిసి మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు.