
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి జరిగిన వైద్య పరీక్షల్లో గాయాల ఆనవాళ్లు బయటపడ్డాయి.
జులై 18న నిర్వహించిన పరీక్షల్లో బాధితురాలి మెడపై గొంతు నులిమిన గుర్తులు, చెంపపై కమిలిన గాయాలు మరియు ఎడమ కాలిపై గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ కేసులో నిందితుడైన ఉదయ్ కృష్ణారెడ్డిని బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.