విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు సుస్మిత కొణిదెలను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
దుర్గ గుడిలో జరగబోయే నవరాత్రులు, ఇతర కార్యక్రమాల నిర్వహణలో సుస్మిత సలహాలు, సూచనలు అందించనున్నారు.