
తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి గదులను అక్రమంగా పొంది, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు రూ.50 నుంచి రూ.1000 అద్దె గదులను పొంది, భక్తులకు 12 గంటల సమయానికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు.
పోలీసులు నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.