
రుణ గ్రహీతలకు ఈఎంఐల చెల్లింపులో సౌలభ్యం కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ సరికొత్త హైబ్రిడ్ గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా వినియోగదారులు 39, 52 లేదా 65 నెలల పాటు స్థిర వడ్డీ రేటును ఎంచుకుని, రెపో రేటు మారినా స్థిరమైన ఈఎంఐని పొందవచ్చు.
ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై కనీసం 7.6 శాతం వడ్డీ రేటు నుండి రుణాలను అందిస్తోందని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.