
అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శ్రావణ్ కుమార్ తన బృందంతో కలిసి 24 గంటల పాటు శ్రమించి 2 వేల మంది ప్రాణాలను కాపాడారు.
శివసాగర్, గోలాఘాట్ సహా ఏడు జిల్లాల్లో 349 గ్రామాలు నీట మునగగా, రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 82కి చేరుకుంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 44 సహాయక శిబిరాల్లో 15 వేల మందికి ఆశ్రయం కల్పించగా, వరద బాధితుల సంఖ్య 1.78 లక్షలుగా నమోదైంది.