
శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) శుక్రవారం లేఖ రాసింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 షెడ్యూల్-11 నిబంధనల ప్రకారం, శ్రీశైలంలోని నీటిని విద్యుత్ కంటే తాగునీటి అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని బోర్డు స్పష్టం చేసింది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, రిజర్వాయర్లలోని నీటి నిల్వలను పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచించింది.