
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 229 పరుగులకే ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు బౌలర్ల సమిష్టి కృషితో భారత్ అండర్-19 జట్టు ఈ ఘన విజయాన్ని అందుకుంది.