
అమెరికా నిఘా సంస్థ సీఐఏ చీఫ్ రాట్‌క్లిఫ్ మాస్కోలో రహస్యంగా పర్యటించి రష్యన్ సీక్రెట్ సర్వీసెస్ అధికారులతో భేటీ అయ్యారు.
ఈ భేటీపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందిస్తూ, సీఐఏ చీఫ్ రష్యన్ నిఘా అధికారులతో మాట్లాడారని, పుతిన్‌తో కాదని స్పష్టం చేసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా నిఘా అధిపతి మాస్కోలో పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.