
దేశంలో బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ప్రతిపాదించింది.
ప్రస్తుతం దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలకు బీమా లేదని, ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
బీమా లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి రూ. 5,000 లేదా ప్రీమియంకు మూడు రెట్లు, రెండోసారి రూ. 10,000 లేదా ఐదు రెట్లు జరిమానా విధించాలని సూచించింది.