
2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలా వద్దా అనే నిర్ణయానికి వారి వయసు ప్రాతిపదిక కాదని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ స్పష్టం చేశారు.
ఆటగాళ్ల ఫిట్నెస్, దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించే సత్తా, అద్భుతమైన ప్రదర్శనే సెలక్షన్‌కు గీటురాయని ఆయన తెలిపారు.
గత కొంతకాలంగా వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ వరుస శతకాలతో రాణిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు.