
అమెరికన్ టెక్ సంస్థ ఆంథ్రోపిక్ తమ 'క్లాడ్' ఏఐ మోడల్‌కు నైతిక విలువలు నేర్పించేందుకు ప్రముఖ హిందూ స్వామీజీని సంప్రదించింది.
న్యూయార్క్ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానందను శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరిపారు.
ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో తలెత్తే నైతిక సవాళ్లు, భద్రతా ప్రమాణాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు స్వామీజీ వెల్లడించారు.