అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ దూసుకెళ్లాయి.
ఫైనాన్స్, ఎఫ్ఎమ్సీజీ, వాహన షేర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్ 77,000 పాయింట్ల ఎగువకు చేరింది.
ముడిచమురు ధర తగ్గడం, విదేశీ కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి.