
ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బండారు హారతి బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును ముందుగా అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలను సూచించారు.
రక్తపోటును 130/80 కంటే తక్కువగా ఉంచుకోవడం, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా కొలెస్ట్రాల్‌ను పరిశీలించడం ముఖ్యం.
అలాగే హెచ్‌బీఏ1సీ షుగర్ స్థాయిలు 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలని వైద్యులు తెలిపారు.