టైట్ అండర్వేర్లు, జీన్స్ ప్యాంట్లు ధరించడం మరియు ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని గంటల తరబడి పనిచేయడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరిగి వీర్య కణాల ఉత్పత్తి దెబ్బతింటుంది.
రోజూ ధూమపానం, ఆల్కహాల్ సేవించడం మరియు ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా బీపీఏ కెమికల్స్ శరీరంలోకి చేరడం వల్ల స్పెర్మ్ కౌంట్ 25 శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పోషకాహారం తీసుకోవడం, రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడం, రాత్రిపూట 8 గంటలు సరిపడా నిద్రపోవడం ద్వారా 90 రోజుల్లో ఆరోగ్యకరమైన వీర్యం మళ్లీ తయారవుతుంది.