
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన నకిలీ చిరుత ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని ఫతుల్లాగూడలో చిరుత సంచరిస్తోందంటూ ఈ తప్పుడు ప్రచారం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కర్ణాటకకు చెందిన సచిన్ను నిందితుడిగా గుర్తించి భారతీయ న్యాయ సంహిత కింద పోలీసులు కేసు నమోదు చేశారు.