
కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ్‌బాబు రజత పతకాన్ని సాధించారు.
అజయ్‌బాబు స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కేజీల స్కోరుతో రెండో స్థానంలో నిలిచారు.
మలేసియాకు చెందిన ఎర్రీ హిదాయత్ ముహమ్మద్ చేతిలో స్వల్ప తేడాతో అజయ్‌బాబు స్వర్ణ పతకాన్ని కోల్పోయారు.