
సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు చేపట్టిన 'మార్చ్ టూ పార్లమెంట్' నిరసనపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఆందోళనల్లో ఆకతాయిలు చొరబడి దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు, ఈ పిల్‌పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.