
గుజరాత్లో చండీపుర వైరస్ వ్యాప్తి కారణంగా గత ఐదు వారాల్లో 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం గుజరాత్లోని 12 జిల్లాల్లో, రాజస్థాన్లోని 3 జిల్లాల్లో వైరస్ బాధితులు ఉన్నారని, మొత్తం 39 మంది చిన్నారులకు వైరస్ సోకినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పశువులు, మేకల రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించిన అధికారులు, వైరస్ వాహకాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.