
ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో ఎస్యూవీ వాహనాల ధరలను పెంచాలని మహీంద్రా అండ్ మహీంద్రా యోచిస్తోంది.
కమోడిటీ ధరల సరళిని పరిశీలిస్తూ రానున్న ఒకటి రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై నెలల్లో ఇప్పటికే మూడు విడతలుగా ధరలను పెంచినట్లు సంస్థ వెల్లడించింది.