
పట్నా నుంచి లఖ్నవూ వెళ్తున్న ఇండిగో విమానం 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మిక ప్రమాదం తలెత్తింది.
ఈ లోహ విహంగాన్ని పిడుగు బలంగా తాకడంతో దాని ముందు భాగం కొంత వరకు లోపలికి చొచ్చుకు పోయింది.
ఈ ఆకస్మిక ఘటనతో గగనతలంలో విమానానికి ప్రమాదం ముంచుకొచ్చినప్పటికీ అంతా సురక్షితంగా బయటపడ్డారు.