
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామక అక్రమాల అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా చంద్రబాబును నిలదీశారు.
అర్హత పరీక్ష నిబంధనను పక్కనపెట్టి జీవోలు ఎందుకు జారీ చేశారని, నియామకాలు పూర్తయ్యాక పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు.
డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు.