పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి అధికారికంగా తొలగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 2026లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన క్రమంలో ఈ చర్య తీసుకున్నారు.
పేటీఎం యూపీఐ సేవలు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మోడల్ కింద ఇతర బ్యాంకులతో అనుసంధానమై పనిచేస్తున్నందున సాధారణ యూపీఐ చెల్లింపులకు అంతరాయం ఉండదు.