
నైరుతి కొలంబియాలో బంగారు గని కూలిపోవడంతో 14 మంది మరణించారు, మరో ఏడుగురు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 12 నుంచి 15 మంది ఆచూకీ తెలియరాలేదని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ బంగారు గనిని అక్రమంగా నిర్వహిస్తున్నారని, సరైన భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.