
అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగితే బాధితులకు పరిహారం ఇప్పించే అధికారం కోర్టులకు ఉంటుందా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అణు చట్టంలోని పరిమితులు బాధితులకు న్యాయమైన పరిహారం అందకుండా అడ్డుకోగలవా అని కోర్టు నిలదీసింది.
ఈ అంశంపై స్పష్టత కోరుతూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.