
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతి ఒప్పందం కుదిర్చే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సైద్ రజా మొసయెబ్ మొత్లాగ్ పేర్కొన్నారు.
శాంతిని ప్రేమించే దేశంగా భారత్‌కు ఇరు దేశాలను చర్చల టేబుల్ వద్దకు తీసుకువచ్చే శక్తి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
హార్మూజ్ జలసంధిపై అమెరికా నియంత్రణను ఇరాన్ తీవ్రంగా ఖండించగా, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్ముతుందని ఆయన గుర్తు చేశారు.