
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పూర్తి సభ్య దేశాల బౌలర్లలో అత్యధికంగా 13 మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రా, జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ చెరో 12 మెయిడిన్ ఓవర్లతో సమంగా ఉండగా, తాజా ప్రదర్శనతో బుమ్రా సోలోగా రికార్డును సొంతం చేసుకున్నాడు.