
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కిలోల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
అజయ్ బాబు మొత్తం 330 కిలోలు (స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కిలోలు) ఎత్తి, స్వర్ణ పతక విజేత హిదాయత్ కంటే కేవలం ఒక కిలో తేడాతో రెండో స్థానంలో నిలిచాడు.
ఈ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో షర్మిల ధన్‌ఖడ్ 9.81 మీటర్ల త్రోతో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించగా, సర్వేశ్ కుశారే హైజంప్‌లో రజతం సాధించాడు.