
హైదరాబాద్కు చెందిన సౌర విద్యుత్ సంస్థ ట్రూజన్ క్లీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మహారాష్ట్రలో ప్రాజెక్టుల ఏర్పాటు నిమిత్తం రూ.236 కోట్ల ఆర్డర్ లభించింది.
హరిఓం పవర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి ఈ ఆర్డర్ దక్కినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ ఒప్పందం ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 72 మెగావాట్ల సామర్థ్యంతో నూతన సోలార్ ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్మించనుంది.