
ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలానికి మంజూరైన ఎస్టీ సంక్షేమ గురుకుల పాఠశాలను 55 కి.మీ దూరంలోని సరంపల్లిలో నిర్వహిస్తున్నారు.
2016 నుంచి మూడేళ్ల పాటు నాగిరెడ్డిపేటలోనే తరగతులు నిర్వహించినప్పటికీ, ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు దూరంగా మారింది.
అధికారులకు దగ్గరగా ఉండేలా పాఠశాల నిర్వహణను మార్చడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.