
ఉగాండాలో గత 15 ఏండ్లలో 38 మందిని హత్య చేసి వారి మాంసాన్ని తిన్న నరరూప రాక్షసుడు ముజురిజి మోసెస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయాన్ని ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ ముహూజి కైనెరుగాబా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
నిందితుడు 2010 నుంచి 2025 మధ్య కాలంలో మసాకా, ఇబాండా, కజో జిల్లాల్లో ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.