
అమెరికాకు చెందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం భారత్‌లో ఏర్పాటు చేసే తొలి క్యాంపస్‌కు హైదరాబాద్ వేదిక కానుంది.
కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ (సీయూ డెన్వర్) తన విదేశీ ప్రాంగణాన్ని నగరంలో ప్రారంభించనుంది.
ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం ద్వారా నగరంలోకి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యావకాశాలు రానున్నాయి.