
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లీగ్ దశలో మైటీ మరాఠాస్, కాకతీయ నైట్స్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.
ఈ రెండు జట్లు తలా 6 విజయాలు, 3 పరాజయాలతో మొత్తం 12 పాయింట్లు సాధించి సమంగా నిలిచాయి.
పాయింట్ల తేడా ఆధారంగా మరాఠాస్ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ఆదివారం ఈ రెండు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది.