
యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి.
దీనికి ముందు సెప్టెంబర్ 26, 27 తేదీలు శని, ఆదివారాలు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల సేవలకు అంతరాయం కలగనుంది.
ఖాతాదారులు ముఖ్యమైన లావాదేవీలను సమ్మె కంటే ముందే పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది.